
ప్రజలలో అపోహలను సృష్టించి ప్రభుత్వ పథకాల పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శంకర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టగా, కొందరు కావాలని దరఖాస్తు ఫారాలు ఇవ్వడం లేదని ఆరోపించడం శోచనీయమన్నారు. ఈనెల 28 నుంచి 3 వరకు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించి దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మండలంలో పదివేల 643 కుటుంబాలకు, 113 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. కొంతమంది దరఖాస్తులు ఇవ్వడం లేదని, మరి కొంతమంది పథకాలు వస్తాయో లేదో అని ప్రచారం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈనెల 17 లోపు మండలానికి సంబంధించిన దరఖాస్తులన్నింటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.