– యూ.బీ సీనియర్ మేనేజర్ రాజేష్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రూపాయి నాణేలు పై వస్తున్న పుకార్లు ను నమ్మవద్దని,రూ.10 నాణెం చెల్లదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు అపోహలు వద్దని యూనియన్ బ్యాంక్ స్థానిక సీనియర్ మేనేజర్ రాజేష్ అన్నారు. గురువారం పలు దుకాణాల యజమానులు, వినియోగదారులకు యూనియన్ బ్యాంక్ అశ్వారావుపేట నందు రూ.10 నాణేలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో పది రూపాయల నాణెం ఇస్తే తీసుకునేందుకు సామాన్యులు, దుకాణదారులు వెనకాడుతున్నారని కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. రూ.10 వినియోగంలో ప్రజలు ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంకు అధికారులు ఇప్పటికే అనేకసార్లు స్పష్టమైన వివరణ ఇచ్చారన్నారు. ఈ విషయంలో దుకాణదారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది మురళి, నాగబాబు, శ్రీధర్, జనార్ధన్, పలువురు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.