కేసీఆర్ మోసపురిత మాటలు నమ్మవద్దు 

– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్

 నవతెలంగాణ- నెల్లికుదురు
కేసీఆర్ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ అన్నారు. మండలంలోని వావిలాల బోటిమీ తండా శ్రీ రాజ్య తండా నరసింహుల గూడెం సంధ్య తండా బంజారా శ్రీరామగిరి గ్రామాలలో సిపిఐ జిల్లా నాయకులు అజయ్ సారధి విజయసారథి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ ప్రధాన కార్యదర్శి కాసo చిన్న లక్ష్మారెడ్డి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు లతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని అన్నారు. వారు స్వార్ధ రాజకీయాలకి అంకితమయ్యారని వారి కుటుంబ పాలన రాజకీయంచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్, మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య, మాజీ సర్పంచ్ నెలకుర్తి వెంకటరెడ్డి నాయకులు, వీరన్న నాయక్, సుందర్, నలమాస, శ్రీనివాస్, వనమాస బిక్షపతి, బాలాజీ నాయక్, నాగరాజు, యాకూబ్, గోగుల అశోక్, పొనుగోటి రామారావు ,పాట్నాశెట్టి, నాగరాజు, గుండె పాక యాకన్న, వారి పల్లి వెంకన్న, పైసా స్వామి, నారాయణ, కాలేరు, మల్లేష్ జి, మోహన్ సురేందర్ రెడ్డి, అర్జున్ రెడ్డి, బెల్లీ నర్సయ్య, మల్లేశం, శ్రీను, మురళి తదితరులు పాల్గొన్నారు.