ప్రతిపక్షాల బుట్టచోర్ మాటలను నమ్మోద్దు..

– సంక్షేమంలో ఫలాలు, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్..
– దివ్యాంగులకు ఇకనుండి పింఛను 4,016 పేన్షన్..పత్రాల పంపిణీ.
– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రతిపక్షాల బుట్టచోర్ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, ఏళ్లపాటు పాలించిన సమయంలో ప్రజల అవసరాలను తీర్చనివారు ఇప్పుడు తీరుస్తామని గ్రామాల్లోకి వచ్చి తిరుగుతున్నారని అలాంటి వారికి ప్రజలు నమ్మొద్దని, సంక్షేమం అభివృద్ధి పథకంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని రాబోవు రోజుల్లో కెసిఆర్ కు ప్రజలు దీవించాలని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ట్రైనింగ్ సెంటర్ లో జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్  చేతుల మీదుగా దివ్యాంగులకు బీడీ టేకేదారులకు నూతనంగా మంజూరైన పేన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.ఈ సంద్భంగా ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఇప్పటికే దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. తాజా పెంపుతో దివ్యాంగుల పెన్షన్ మొత్తం రూ. 4,116 చేరుకుందని, దివ్యాంగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అసరా పింఛన్లు, కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, ఫైలేరియా, ఎయిడ్స్, గీత కార్మికులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, డయాలసిస్ బాధితులకు నెలకు రూ 2,016,  వికలాంగులకు రూ 3,016/-ల చొప్పున ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుందని,జూలై నుండి వికలాంగుల పింఛను 3,016/- నుండి రూ4,016 లకు పెంపుదల చేయడం సంతోషదయకమన్నారు. ప్రతి నెల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 62,523 మందికి, 13 కోట్ల 44 లక్షల 38,368 రూపాయలు ప్రతినెల పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. జిల్లాలోని అత్యధిక పెన్షన్ రూరల్ నియోజకవర్గం మాత్రమే అన్నారు.ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో కెసిఆర్ కు అండగా నిలవాలని, కెసిఆర్ నీ మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని దేశంలోని టిఆర్ఎస్ పార్టీని విస్తరింప చేయాలని సూచించారు.  వేరే రాష్ట్రాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, ఇప్పటికే మహారాష్ట్ర నుండి చాలామంది బిఆర్ఎస్ పార్టీలో చేరుతామని  ఫోన్లు చేస్తూ న్నారని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పేదల సంక్షేమ ప్రభుత్వం, ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని, ఆసరా పింఛన్, బీడీ పింఛన్, కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు, రైతు బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, మండల పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గజవడ జైపాల్, ఎంపీటీసీల పొరం అధ్యక్షులు సాయిలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు అమీర్ ఖాన్,  సర్పంచులు గోపూ నడిపన్న,నీరడి పద్మారావు, మోహమ్మద్ యూసఫ్, జగదీష్, సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ,నల్లవేల్లి సాయిలు, ఓడ్డేం నర్సయ్య,రాథోడ్ విట్ఠల్,అంబరసింగ్ గారు, సుధాం, కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్ నాయకులు తదితరులు  పాల్గొన్నారు.