– శిఖ అరవింద్ గౌడ్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకం నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమిచ్చి, విడుదలవారీగా ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, పుకార్లు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ మండల ఓబీసీ చైర్మన్ శిఖ అరవింద్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం సోమవారం, ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు. గత పది సంవత్సరాలు, గత బి ఆర్ స్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో కాలయాపన చేసిందని అన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచార నిర్వహిస్తున్నారని అన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు చేసే విష ప్రచారాన్ని నమ్మవద్దని హితువు పలికారు. అధికారులు ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహిస్తున్నారని, అర్హులైన వారిని ప్రభుత్వమే గుర్తిస్తుందని అన్నారు. అర్హులైన వారిని గుర్తించడానికి అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని అన్నారు.