– బీఆర్‌ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
పగటివేషగాళ్ల మాటలు నమ్మొద్దని మళ్లీ గెలిచేది తామేనని, అభివద్ధి చేసేది తామే గెలిచేదీ తామేనని మిర్యాలగూడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరావు అన్నారు. సోమవారం అడవిదేవులపల్లి మండలంలోని నడిగడ్డ, నల్లమిట్ట తండా, బంగారికుంటతండా, ముల్కచర్ల, బాల్నేపల్లి, చిట్యాల, ముదిమాణిక్యం గ్రామాల్లో ప్రగతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గిరిజన మహిళలు సంప్రదాయంగా నత్య ప్రదర్శనలు చేసి అలరింపజేసారు. ఎన్నికల ప్రచార యాత్ర నుద్దేశించి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ గ్రామాలు, తండాలు అభివద్ధిపై సుదీర్ఘకాలం ప్రత్యేక దష్టి సాధించానని, అందులో భాగంగానే, రోడ్లు, విద్యుత్, సాగునీరు, త్రాగు నీటి సమస్యలు పరిష్కారం కోసం కషి చేసానన్నారు. తేలాండ్ భూములు కలిగిన ఈ ప్రాంతానికి లిప్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేయించడం జరిగిందన్నారు. పోడు పట్టాలు, అసైన్డ్ భూముల పట్టాలు పంపిణీ చేసామన్నారు. సీఎం కేస్‌ఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలు తీసుకువచ్చి అమలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలు, తండాల్లో అభివద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలుతో ప్రజలకు చేరువైన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. నవంబర్ 30 న జరుగనున్న సాధారణ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దగ్గింపూడి నారాయణరెడ్డి, ఎంపిపి ధనావత్ బాలాజీ నాయక్, జడ్పిటిసి కుర్రా సేహ్యనాయక్, వైస్ ఎంపిపి కురాకుల మల్లేశ్వరి గోపీనాథ్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కురాకుల చినరామయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్తు మర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు,బిఆరెస్ మండల ప్రధాన కార్యదర్శి కుర్ర శీను, బి ఆర్‌ఎస్ నాయకులు గుండా సీతారామయ్య, ఎంపీటీసీ పేర్ల లింగయ్య, అడవిదేవులపల్లి ఉప సర్పంచ్ కేశబోయిన కొండలు, కోఆప్షన్ సభ్యుడ్ను బాబ్జాన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.