మున్సిపల్ ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చవద్దని,చెత్తను ఆరుబయట,రోడ్ల పైన,మురికి కాలువల్లో వేయకుండా మున్సిపాలిటీకి చెందిన చెత్త సేకరణ వాహనానికి మాత్రమే అందించాలని కమిషనర్ కే.రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అలా సేకరించిన చెత్తను తడి,పొడిగా వేరుచేసి సేంద్రియ ఎరువుగా తయారుచేస్తామన్నారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10 వ వార్డులో నున్న డీఆర్ సీసీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.అక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాలను కాల్చడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం 11 వ వార్డులోని రజక వాడలో రూ 2.50 లక్షలతో (జనరల్ ఫండ్) నూతనంగా నిర్మిస్తున్న మట్టి రోడ్డు పనులను పరిశీలించారు.ఆయన వెంట సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి,వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,బీఆర్ఎస్ నాయకులు నందాల శ్రీకాంత్ పలువురున్నారు.