ప్రాణాలు తీసే వరకూ పట్టించుకోరా.. ?

Don't care until you die..?– ట్రాన్స్‌ ఫార్మర్‌
నవతెలంగాణ – బోనకల్‌
నేను ఎవరేవో ఒకరి ప్రాణాలు తీసే వరకు నా గురించి పట్టించుకోరా అని మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గల ట్రాన్స్‌ ఫార్మర్‌ అధికారులను ప్రశ్నిస్తుంది. నా చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్నాయి అయినా ప్రమాదకరంగా ఉన్న పట్టించుకోకపోవడంలో అర్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అంటూ ట్రాన్స్‌ ఫార్మర్‌ మండల అధికారులను ప్రశ్నిస్తుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. మండల కేంద్రంలోని తహసిల్దార్‌, రైతు వేదిక మధ్య ప్రభుత్వ కార్యాలయాల కోసం ఓ ట్రాన్స్‌ ఫార్మర్‌ ను విద్యుత్‌ అధికారులు గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్‌ ఫార్మర్‌ కోసం వరలను ఏర్పాటు చేసి వాటి మీద ట్రాన్స్‌ ఫార్మర్‌ ను ఉంచారు. వరల దిమ్మె ఒకవైపు వరకి ప్రమాదకరంగా ఉంది. దీంతో విద్యుత్‌ అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టకుండా ఒరిగిన చోట వరలకు ట్రాన్స్‌ ఫార్మర్‌ మధ్య తాత్కాలికంగా రాళ్లు ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గాని పెద్ద ఎత్తున గాలి వీచిన సమయంలో ప్రమాదం వలన వాటి మధ్య ఏర్పాటు చేసిన రాళ్లు ఒకవేళ కిందపడిపోతే ట్రాన్స్‌ ఫార్మర్‌ కూడా కింద పడిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు, ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ ట్రాన్స్‌ ఫార్మర్‌ పక్క నుంచి వెళ్తున్నారు. ఇటువంటి సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ ప్రమాదానికి గురైతే భారీ ప్రాణా నష్టం సంభవిస్తుంది. ప్రతిరోజు మండల స్థాయి అధికారులు దీని పక్కనుంచే వెళ్తున్న పట్టించుకోకపోవడం విశేషం. దీనికి మరమ్మతుల కోసం అయ్యే ఖర్చు జానెడు కాగా ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాణనష్టం మూరేడు జరిగే ప్రమాదం ఉంది. దీనివలన ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంలో అర్థం ఏమిటో అర్థం కావడం లేదని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాణ నష్టం సంభవించక ముందే మండల అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.