
నవతెలంగాణ – కరీంనగర్: రాజకీయ నాయకులు తమ లబ్ధికోసం కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని తెలంగాణ బిసి ఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి గడప కోటేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ముదిరాజ్ వారిని బిసి.డి వారిని బి సీ ఏ లో కలుపుతామని ప్రతి రాజకీయ పార్టీ చెబుతూ, వాగ్దానాలు చేస్తూ బి సి.ఏ లో ఉన్న 56 కులాల ఓటు బ్యాంకును దూరం చేసుకుంటారా అని పార్టీలను హెచ్చరించారు. అలాగే బీసీ ఏ వారిని ఎస్.సీ ఎస్.టి లను కలిపిన తరువాత బి సీ.డి లను బీసీ.ఏలో కలుపుకోండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బీసీ.ఏ 26 కులాలను తెలంగాణలో కలపకూడదు అని తెలిపారు.