
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని గురువారం వాహనదారులకు ఎస్సై నరేష్ సూచించారు. మండలంలోని గొల్లపల్లి స్టేజి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులనుదేశించి మాట్లాడుతూ.. వాహనదారులు, వాహన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, హెల్మెట్, సీటు బెల్టు తప్పక ధరించాలని, మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వాహనదారుల పై కేసు నమోదు చేసి జరమానా విధించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.