
నాడు పోడు భూములకు కోసం పోరాడారు.పోలీసులు కేసులు పెట్టారు.కోర్టులకు వెళ్ళారు. నేడు అవే పోడు భూములకు పట్టాలు పొందారు.ప్రతీ గ్రామానికి నేనే స్వయంగా వచ్చి పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తాను.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనం జీవితకాలం గుర్తుంచుకోవాలి అంటూ పోడు లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండలాల వారీ పోడు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం అశ్వారావుపేట మండలంలో ప్రారంభించారు. ఇందులో వేదాంత పురం,ఊట్లపల్లి,కేసుప్పగూడెం పంచాయితీల్లో 8 గ్రామాలకు చెందిన 440 మంది గిరిజనులకు 373.49 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి తననే స్వయంగా వెళ్ళి పాస్ పుస్తకాలు అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు స్వయంగా చెప్పారని,అందుకోసం గ్రామాలు వారీగా పాస్ పుస్తకాలు పంపిణీ కి ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్ లూదర్ విల్సన్, ఎం.డి.ఒ శ్రీనివాసరావుకు కు ఆదేశించారు.గతం లో ఏ ప్రభుత్వం వ్యక్తిగత లబ్ధి చేకూరే పథకాలు చేపట్టలేదని,కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ కుటుంబంలో ఎవరికో ఒకరికి లబ్ధి చేకూరే పధకాలను తెచ్చిందని అన్నారు.పోడు పట్టాలు దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. కేశప్పగూడెం కార్యక్రమంలో తన మాతృ భాష అయిన కోయ యాసలో మాట్లాడి లబ్ధిదారులను ఉత్తేజపరిచే ఆరు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామ మూర్తి,ఎం.పి.టి.సి రామక్రిష్ణ,సర్పంచ్ లు సోనీ శివశంకర్ ప్రసాద్, సాధు జ్యోత్స్న బాయి, కొమరం బాబూరావు, కార్యదర్శులు యాకూబ్ ఆలీ, శ్యామ్, సతీష్, నాయకులు బండి పుల్లా రావు ,జుజ్జూరపు వెంకన్న బాబు,సత్యవరపు సంపూర్ణ,మందపాటి రాజ మోహన్ రెడ్డి,గొడవర్తి వెంకటేశ్వరరావు,తాడేపల్లి రవి,చందా లక్ష్మీ నర్సయ్య,చిన్నంశెట్టి వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సోమవారం పంపిణీ చేసిన గ్రామాలు – లబ్ధిదారులు – ఎకరాలు వివరాలు:
గ్రామం లబ్ధిదారులు ఎకరాలు
కేశప్పగూడెం 123 207.35
ఊట్లపల్లి 115 179.29
నల్లబాడు 53 103.33
తిమ్మాపురం 42 63
వేదాంత పురం 41 41
రాజానగరం 34 68.37
గంగారం 33 50.30
పాపిడిగూడెం 32 47.27
మొత్తం 440 373.49