కేటీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడకు: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
కేటీఆర్ అధికారంలో ఉండి గతంలో రైతులకు, నిరుద్యోగులకు, ఏమి చేయలేక, విద్యావ్యవస్థను మీరు మీరు ఏం చేసి, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని బుధవారం మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత మీ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తామని, డబ్బులు చెల్లించిన యాదవులకు 30% మాత్రమే గొర్రెల పంపిణీ చేసి, మొండి చేయి చూపించింది మీ ప్రభుత్వం కాదా, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేపట్టక, నిరుద్యోగ భృతి ఇవ్వక నిరుద్యోగులను నిండా ముంచింది మీ కెసిఆర్ ప్రభుత్వం కాదా? మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నిధులు మంజూరు చేయక ఇబ్బంది పెడితే, అంగన్వాడీలను సమస్యలను పరిష్కరించకపోతే రోడ్లకు రోడ్లపై వస్తే, వీరికి అండగా ఉండి ధర్నాలు ర్యాలీలు నిర్వహించి ప్రతిపక్షంలో మేము అండగా ఉన్నది, మరిచిపోయారా? మీ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో ఒక పోస్ట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా, తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదని చెప్పి, గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నియమించిన ప్రభుత్వం మీది కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయి, మతిభ్రమించి అధికార పక్షాన్ని అదే పనిగా విమర్శించడం సరైనది కాదు. ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ప్రభుత్వానికి సహకరించాలి కానీ, ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి పై విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.