నామినేటెడ్ అంతా.. చెన్నమనేని చెంతా !

– రూట్ మార్చని కార్యకర్తలు
నవతెలంగాణ- చందుర్తి
బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా  చెలిమెడ లక్ష్మి నర్సింహా రావును ప్రకటించడంతో వేములవాడ నిహాజక వర్గంలో రాజకీయ సమీకరణాలు చేంజ్ అయినప్పటికీ ఎమ్మేల్యే రమేశ్ బాబు వర్గం నుండి ఇప్పటికే కొంత మంది మాత్రం చెలిమేడను కలసినారు.దింతో వేములవాడలో సంగీత నిలయం బోసిపోయిందని పలువురు కార్యకర్తలు అంటున్నారు.
రూట్ మార్చని కార్యకర్తలు
చందుర్తి మండలంలోని కొందరు బిఆరెస్ కార్యకర్తలు రమేష్ బాబు ను నమ్ముకొని కిమ్మని అనకుండా సైలెన్స్ ఐపోయారు.ఇప్పటికే కొందరు సర్పంచులు,ఎంపిటిసిలు కొత్త అభ్యర్థిని కలసినప్పటికి మరికొందరు రమేష్ బాబు ను విడలేకపోతున్నారు.
నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు మాత్రం రమేష్ బాబు వైపే
నియోజక వర్గంలో ఏడు మండలాల కు చెందిన రమేష్ బాబు పెట్టిన నామినేటెడ్ భిక్షతో  ఉన్నారు అందుకు నామినేటెడ్ పదవులు ఉన్నవారు  ఇంకా రమేష్ బాబు చెంత నే ఉన్నారు. ఇక భవిష్యత్ లో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.