పోలీసు అమరుల త్యాగాలను మరవొద్దు: ఎస్ఐ గంగరాజు 

Don't forget the sacrifices of police martyrs: SI Gangarajuనవతెలంగాణ – దుబ్బాక
శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రజల ప్రాణ రక్షణ కోసం నిర్విరామంగా శ్రమించేది పోలీసులు మాత్రమేనని… కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరులను మరువొద్దని దుబ్బాక ఎస్ఐ వీ.గంగరాజు అన్నారు. ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ సందర్బంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో “ఓపెన్ హౌస్” అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ  సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసులు నిర్వర్తించే విధులు, వినియోగించే ఆయుధాలు, పోలీస్ స్టేషన్ గదులు, పరిసరాలను అలాగే నూతన చట్టాలు, టెక్నాలజీ వినియోగం గురించి అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ..ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి, మిరుదొడ్డి ఎస్ఐ లు హరీష్, పర్శరాములు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్  లక్ష్మీనారాయణ, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.