నవతెలంగాణ – మోర్తాడ్
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్సై అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు మాదక ద్రవ్యాల నిర్మూల భాగంగా ప్రభుత్వ కళాశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ నినాదాలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోకుండా మంచి భవిష్యత్తు నిర్మూలన దిశగా యువత ముందడుగు వేయాలని, పలు సేవా కార్యక్రమంలో యువత ముందుకు రావాలని ఎస్ఐ అనిల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. యువత అధికంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేస్తుందని ఇలాంటి సంఘటనలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలని, మాదక దవ్యాలకు అలవాటు పడిన వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో సమస్యలు ఇవ్వాలని అన్నారు. బస్టాండ్ సభ్యుల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపక బృందం పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.