నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో పెట్టుబడి పెట్టి అధిక రాబడికి ఆశపడి మోసపోవద్దని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. జెఫరీస్ ఎంటర్ప్రైస్, సాక్షిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ ద్వార డబ్బులు వేరు, వేరు బ్యాంక్ ఎకౌంట్స్ లలో డబ్బులు వేయించుకొని, నమ్మించి వాట్సాప్ ద్వార పరిచయం అయి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ ద్వార మాట్లాడుతున్నారని తెలిపారు. వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి నమ్మించి పెట్టుబడి పెట్టెల చేసి, అధిక లాభాన్ని చూపించి డబ్బులు పెట్టిన తరువాత విత్ డ్రా కు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి మోసపూరిత నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ ల పై అప్రమత్తంగా వుండాలని, ఈ సంఘటన పై ఒ బాడితుడు ఫిర్యాదు చేయగా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయటం జరిగింది. దీని లో భాదితుడు ఎక్కువ లాభాలు ఆశించి పైన తెల్పిన జెఫరీస్ ఎంటర్ప్రైస్, సాక్షిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ లో సుమారు పదకొండు లక్షలు వరకు పెట్టుబడి పెట్టి మోసపోయినాడని తెలిపారు. కావున నల్లగొండ జిల్లా ప్రజలు ఇలాంటి సంఘటనలు ముందుగానే గుర్తించి నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ వైపు ఆకర్షించ వద్దని, అట్టి వారిని ముందుగానే గుర్తించి వారి కాల్స్ ను బ్లాక్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని, ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి తెలపాలని, అందుబాటులో వున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.