దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు

Don't get cheated by selling grain to brokersనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
రైతులు వరి ధాన్యం దళారులకు తక్కువ ధరకు అమ్మి  మోసపోవద్దు అని, ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని ఏవో సుధారాణి అన్నారు. శనివారం, యాదగిరిగుట్ట మండలంలోని దాతర్ పల్లి, రాళ్ల జనగాం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన చేశారు. రైతులు తమ ధాన్యన్ని తేమ శాతం చూసుకుని రావాలని తెలిపారు. 17 శాతం కంటే తక్కువ ఉండాలని తెలిపారు. రైతులు దళారులకు అమ్ముకోవద్దని తెలిపారు. రైతులు ప్రభుత్వానికి తమ ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని సూచించారు.