అధైర్య పడకండి.. ఆత్మహత్యలు చేసుకోకండి

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవ తెలంగాణ-రామారెడ్డి :
ఆరుగాలం కష్టపడి, బిడ్డలు ఉన్నతగా బతకాలని, మంచి చదువులు చదివించాలని ఆశించి తల్లిదండ్రులు, కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువులకు పెడితే, ఐదు రూపాయల అన్నము తింటూ, కళ్ళల్లో ముల్లులు గుచ్చుకొని, చెట్ల కింద కష్టపడి చదివిన కొలువులు రాకపోవడంతో బిడ్డలు ఆధర్యంతో, ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్రెడ్డి ఆదివారం ఒక్క ప్రకటన లో పేర్కొన్నారు. విద్యార్థులారా, అధైర్య పడకండి, ఆత్మహత్యలు చేసుకోవద్దని, నిరుద్యోగ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, మోడీ మౌనం, కెసిఆర్ కొర్రీలతో యువత నిరాశపడుతున్నారని, రోజురోజుకు వయసు పెరుగుతున్నదంతో, ఉద్యోగం రాక, మానసికంగా  కుంగిపోతున్న బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్  ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేలా కృషి చేస్తుందని, రాజకీయాలపై, సొంత ఆస్తుల  పై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న హైదరాబాదులో ప్రవళిక, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండ బాదావత్ అనిల్ కుటుంబాలకు భరోసా కనిపిస్తామని, అండగా ఉంటామని అన్నారు.