
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తమ్మిశెట్టి సత్యనారాయణ, బండారి నరసింహ రామయ్య, కామ శ్రీనివాస్ కుటుంబాలను పరమార్షించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అధైర్య పడొవద్దు బీఆర్ఎస్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు,మాజీ సర్పంచ్ బూడిద మల్లేష్,బిఆర్ఎస్ నాయకులు యాదగిరి రావు,రాజేశ్వర్ రావు,బూడిద సదయ్య,అక్బర్,మధు,కుమార్,బాలయ్య పాల్గొన్నారు.