అదైర్య పడవొద్దు బీఆర్ఎస్ అండగా ఉంటుంది..

– పలు బాధిత కుటుంబాలను పరమార్షించిన జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడొద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు.మంథని నియోజకవర్గంలోని మైదుపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సడవలయ్య, దేవరాంపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రామయ్య, కుసుమ నరేశ్, కాటారం మండల కేంద్రానికి చెందిన దుర్గం సిద్దు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బాధిత కుటుంబాలను బుధవారం జెడ్పి చైర్మన్ పరామర్శించి మృతుల చిత్రపటాలని ఘనంగా నివాళులర్పించారు. అదైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.