అధైర్య పడవద్దు.. అండగా ఉంటాం : అధ్యక్షుడు సంపత్ యాదవ్

నవతెలంగాణ –  మల్హర్ రావు
అధైర్య పడవద్దు అండగా ఉంటామని అఖిల భారత యాదవ మహాసభ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు మేకల సంపత్ యాదవ్ అన్నారు. మండలంలోని ఇప్పులపల్లి గ్రామంలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కొడపర్తి రమేష్ కుటుంబాన్ని బుధవారం పరమార్శించి, అధైర్య పడవద్దు యాదవ సంఘము అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,రూ.5వెలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు నలిగేటి సతీష్ యాదవ్,కాటారం డివిజన్ ప్రధాన కార్యదర్శి బోయిని రాజయ్య యాదవ్,మండల గౌరవ అధ్యక్షుడు యాధండ్ల రామన్న యాదవ్,కోడారి,చిన మల్లయ్య యాదవ్, కత్తెర సాల యాదవ్,రాజవిరు యాదవ్, మొగిలి రాజ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.