
– సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లను మెసేజ్ లను క్లిక్ చేసి మోసపోవద్దు
నవతెలంగాణ – కంటేశ్వర్: మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో అధిక వడ్డీ ఆశా చూపి, పెట్టుబడికి రెట్టిoపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులని మోసం చేస్తున్న కేసులు ఈ మధ్య కాలంలో చాలా నమోదు అవుతున్నాయి అని సైబర్ క్రైమ్ ఏసిపి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారు. జిల్లా ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు,మెసేజ్ లు క్లిక్ చేయకూడని, నకిలీ వెబ్ సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారు,అంతే కాకుండా వైద్య సహాయం,పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారు అని, లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదు అని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని లేని యెడల హెల్ప్ లైన్ నంబర్ 1930 కానీ 155260 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు.సెల్ ఫోన్లు కు వచ్చే కేవైసి అప్డేట్ మెసేజ్లు,బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని చెప్పే మాటలు నమ్మకూడదు. బహుమతులు వస్తాయంటు పంపే లింకులు క్లిక్ చేయకూడదు. సోషల్ మీడియా వేదికగా ఎవరికి బ్యాంకు యొక్క ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు ఓటిపిలు తెలియ చేయకూడదని అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని పట్టణ సీఐ నరహరి మరియు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముఖిత్ పాషాలు పేర్కొన్నారు. ఇట్టి సైబర్ క్రైమ్ మరియు ఆంటీ ట్రాక్ కమిటీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై పదార్థాల వినియోగంపై అవునా కార్యక్రమంలో మూడవ పట్టణ ఎస్సై ప్రవీణ్ కుమార్ సైబర్ క్రైమ్ ఎస్ఐలు పూర్ణేశ్వర్, ప్రవళిక వారి సిబ్బంది పాల్గొన్నారు.