తప్పి పోదామా తప్పు తెలిసే వరకు…

తప్పి పోదామా తప్పు తెలిసే వరకు...ట్రాఫిక్‌ లోనే సగం దినం అర్పితం
బాస్‌ ఇగోకు ఆఫీసులో బలిపశువు
జీతం చుట్టే తిరుగుతుంది జీవితం ఒక రోజు తప్పి పోదామా
లైబ్రరి పుస్తకాల నీడ కూర్చుని వచ్చేద్దాం…
ఇంటికి చేరితే కోరికలు స్వాగతం
వాయిదా కోరినా కనుకరించని బందాలు
బిల్లుల మిల్లు సంసారం ఒక సాయంకాలం తప్పి పోదామా
బిర్లామందిర్‌ చలువరాతి సన్నిధిలో రాత్రంతా
నలుగురికి దగ్గర అవ్వడానికి
నటన ఎంతో నేర్చుకుని వుండాలి
పొగడ్తనో పార్టీనో ఎప్పుడూ విసరాలి
దోస్తుల నుండి దూరంగా తప్పిపోదామా
అడవిలోకి గుట్టలోకి ఒంటరిగా వారం పాటు
మూడు పూటల మెనూ
నెల నెలా ఇ.ఎం.ఐ అప్ప గింతలు
చచ్చే ముందు టర్మ్‌ పాలసీ షరతు
ఎక్కడ పొరబాటు చేశామో
తప్పిపోయి తప్పు తెలుసుకుని వద్దామా…
– దాసరి మోహన్‌, 9985309080