నవతెలంగాణ – మల్హర్ రావు
ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని,అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి ఎస్సిస్ అధ్యక్షుడు దండు రమేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరులో ప్రజాపాలన గ్రామసభలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ఒక క్రమ పద్ధతిలో కంప్యూటరీకరణ చేసి,ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల ప్రకారం అధికారులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారుఈ నేపథ్యంలో అధికారులు కానీ ఏ ఇతర దళారులు కానీ ఇందిరమ్మ ఇళ్ల ఇప్పిస్తామని డబ్బులు (లంచం) అడిగితే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వొద్దన్నారు.ముఖ్యంగా మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేయాలని పట్టుదలతో ఉన్నట్లుగా తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండాలని సంభదిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు.సర్వేలో భాగంగా ఎవరైనా అధికారులు లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తే ఉన్నతాధికారులు వెంటనే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుని వారి పై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.