చెంచా మాటలొద్దు

– టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి చెంచా మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ అవినీతికి పాల్పడ్డారనీ, అందుకే దర్యాప్తు సంస్థలను విచారణ చేపట్టాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల కోసం ఆయన పోరాటం చేయలేదనీ, అక్రమాలకు పాల్పడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఆయనకు కాంగ్రెస్‌ అన్యాయం చేసినట్టు రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేటీఆర్‌ సైనికుడు కాదనీ, ఆయన యువరాజు అని ఎద్దేవా చేశారు.