
ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎమ్మల్యే జారే ఆదినారాయణ అధికారులకు సూచించారు.ఇప్పటికే చేపట్టిన బోరు నిర్మాణ పనులను పూర్తి చేసి వెంటనే తాగునీరు అందించాలని ఆదేశించారు. మండలంలోని వడ్డిరంగాపురం, కోయ రంగాపురం, గుమ్మడవల్లి, నారాయణపురం, మల్లాయిగూడెం, తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న బోరు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సానుకూలంగా స్పందిస్తూ పరిష్కార చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.