– గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ను వీడారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. దానంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.