నీటి ఎద్దడి రానివ్వొద్దు

నవతెలంగాణ – మహాముత్తారం 
ముందస్తు వేసవిలో తాగునీటి ఎద్దుడి గ్రామాల్లో రానివ్వకుండా అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టాలని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు  ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ పైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనికి 50 మంది కూలీలు తగ్గకుండా చూడాలనిసూచించారు. గ్రామపంచాయతీలలో ఇంటి పన్ను చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. వేసవికాలంలో ప్రతి గ్రామ పంచాయతీలలో నీటి ఎద్దడి లేకుండా ముందే ప్రణాళిక ప్రకారముగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి  లింగమల శారద, ఇంచార్జ్ ఎంపీడీవో , ఎంపీ ఓ శ్రీనివాస రావు, ఏపీఓ, టి ఏ, పంచాయితీ  కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.