నవతెలంగాణ – పిట్లం
వరి ధాన్యమును దళారులకు విక్రయించి నష్టపోవద్దని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గురువారము మండలం లోని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో పరిధిలోని కాటేపల్లి గ్రామంలో ధాన్యము కొనుగోలు కేంద్రమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యమును ప్రభుత్వము ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి లబ్ధి పొందాలని ఆయన అన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యమునకు 2320 రూపాయలు , బి గ్రేడ్ సాధారణ రకమునకు 2300 వందల రూపాయలను ప్రభుత్వము మద్దతు ధరను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
శనగ విత్తనాలు పంపిణీ
మండలంలోని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతులకు రబ్బి సీజన్ కు గాను శనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు విండో చైర్మన్ నాగిరెడ్డి గురువారము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న కొడప్ గల్ విండో పరిధిలోని ధర్మారం, బుర్నాపూర్, అల్లాపూర్, పారేడ్పల్లి, కాటేపల్లి గ్రామాల రైతులకు రబ్బి సీజన్ గాను శనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గల రైతులు విండో సిబ్బందిని సంప్రదించి కొనుగోలు చేపట్టాలని సూచించారు. 25 కేజీల బస్తా 2 వేల రూ.250 రూపాయల పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగా గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ చింతల సాయి రెడ్డి, ఏఈఓ రూప నాయకులు మల్లప్ప పటేల్, మొగుల గౌడ్, చాంద్ పాషా, విండో సీఈఓ హన్మాండ్లు గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.