ఎన్నికల్లో ఓటు వేసే అధికారం పోగొట్టుకోవద్దు

నవతెలంగాణ – చండూరు
వచ్చేనెల  మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. సోమవారం చండూరు  మున్సిపల్ పట్టణంలో విలేకరులతో   మాట్లాడారు.  రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని అన్నారు. ఓటు అనేది చాలా విలువైందన్నారు. రాష్ట్రాల, దేశం తలరాతను మార్చే గల శక్తి ఒక ఓటు అనే ఆయుధానికి ఉందని అన్నారు. అందుకే ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిలా సేవలందించే మంచి నాయకుడిని ఎన్నోకోవడానికి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.