ఈ తప్పులు చేయొద్దు..

Don't make these mistakes..గర్బిణీలు తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో మార్పు వచ్చే సమయం ఇదే. అందుకే ఆ సమయంలోఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
– వీలైనంత వరకు ఇంటి భోజనాన్ని తీసుకోవాలి. ఒకవేళ బయటి ఫుడ్‌ తినాలనిపిస్తే. పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లాలి.
– గర్భిణీలు వీలైనంత వరకు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.
– సీ ఫుడ్‌ తీనే సమయంలో కాస్త జాగ్రత్తగా వుండాలి. మంచిగా వండారా లేదా అనేది పరిశీలించుకోవాలి. లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా చేరే అవకాశాలుంటాయి. ఫుడ్‌ స్టోర్‌లు లేదా బఫేల నుండి ముందస్తుగా ప్యాక్‌ చేసిన సలాడ్‌లు, ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటేనే మంచిది.
– అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే 60శాతం ఆల్కహాల్‌తో తయారుచేసిన హ్యాండ్‌ శానిటైజర్‌ను ఉపయోగించాలి.
– స్ట్రీట్‌ ఫుడ్‌ను పూర్తిగా అవయిడ్‌ చేయాలి. పానీపూరీ, కట్‌లెట్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌లో చేసే ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
– ఇక రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని తినకపోవడం మంచిది. మరీ ముఖ్యంగా వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరం.