– cybercrime.gon.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయండి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన రైతు రుణమాఫీ కార్యక్రమం నేపథ్యంలో ఇదే అదునుగా చూసుకొని కొంత మంది సైబర్ నేరస్థులు వివిధ బ్యాంకుల లోగోస్ వాట్స్అప్ ప్రొఫైల్ పిక్స్ పెట్టి రైతు ఋణమాఫీ అంటూ APK Files లాంటి లింకులను పంపుతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు ఋణమాఫీ అంటూ ఫోన్ కాల్ చేసి ఓటిపి లు అడిగి కూడా రైతుల అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. కావున ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దనీ, ఎలాంటి వ్యక్తి గత సమాచారాన్ని ఆనుమానితులకు తెలపకూడని పేర్కొన్నారు. సమాచారం సంబంధిత బ్యాంక్ వారిని సంప్రదించి తెలుసుకోవాలని తెలిపారు. ఎవరైనా ఇటువంటి సైబర్ నేరానికి గురి అయితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930 కీ కాల్ చేయడం. లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయడం లేదా సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.