
– ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్యాల శేఖర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కకార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయేటట్టుగా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రూ .5117 కోట్లు రూపాయలు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బానోతు నవీన్, చందు అరవింద్, శ్రీను, ప్రవీణ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.