కార్మిక సంక్షేమం ప్రైవేట్ పరం చేయొద్దు: సీఐటీయూ అర్జున్

Don't privatize labor welfare: CITU Arjunనవతెలంగాణ – అశ్వారావుపేట
బిల్డింగ్ కార్మికులు కు సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని,సంక్షేమ పథకాలు అమలు ను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే టెండర్లు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బిల్డింగ్ కార్మికులు అడ్డా వద్ద జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అమలు అవుతున్న ప్రమాద,సహజ మరణం, ప్రసూతి,పెళ్లి కానుక ఈ నాలుగు రకాల సంక్షేమ పథకాలు అమలు ను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వం పిలిచిన టెండర్లు ప్రక్రియను రద్దు చేయాలని అన్నారు.పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ కార్మిక పిల్లలకు స్కాలర్ షిప్, సొంత గృహ వసతి వంటి పథకాలు అమలు చేస్తున్నాయని,కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నూతన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం గాని ఉన్న సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులు పెంచడం లేదని,బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులందరినీ రెన్యువల్ చేయటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని 1996 నిర్మాణ రంగ కార్మికుల చట్టానికి సవరణ చేసి బలహీన పరుస్తుందని అన్నారు.బిజెపి తెచ్చిన లేబర్ కోడ్లు అమలులో భాగంగానే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే చర్యలు జరుగుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు ఇన్సూరెన్స్ కంపెనీల చేతికి వెళితే చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్స్ తిరస్కరించి అడ్డ గోలు షరతులు పెట్టి కార్మికులకు సంక్షేమ పథకాలు రాకుండా పోతాయి అన్నారు. సంక్షేమ బోర్డు సలహా మండలి నియమించాలని ప్రభుత్వం వాడుకున్న రూ.1350 కోట్లు బోర్డు కు జమ చేయాలని ప్రమాద బీమా పరిహారం రూ. 10 లక్షలకు సహజ మరణ పరిహారం ఐదు లక్షలకు పెంచాలని వివాహ ప్రసూతి కానుకలను లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ఈ కార్యక్రమంలో బిల్డింగ్ రంగా మండల నాయకులు వెంకన్న బాబు, కృష్ణ, శ్రీను ,చెన్నారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.