నవతెలంగాణ-రామగిరి
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించడంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని పెద్దపల్లి జిల్లా డీఈఓ డి మాధవి అన్నారు. శుక్రవారం రామగిరి మండలం కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా బోధన అభ్యాసక పరికరాలు, దృశ్య పరికరాల ద్వారా విద్యా సులువుగా గ్రహించి అర్థం చేసుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఎంతో పెద్ద స్థాయిలో ఉన్నారని అన్నారు. పదవ తరగతి గణిత ఉపాధ్యాయుడు సత్యనారాయణ సమక్షంలో గణితంలో విద్యార్థులు నేర్చుకున్న విద్యను పరీక్షించి డీఈవో డి.మాధవి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం శోభన్ రావు, ఉపాద్యాయులు సత్యనారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.