డ్రగ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్సై శ్రీకాంత్ రెడ్డి

 

– సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల కట్టడి
నవతెలంగాణ – తాడ్వాయి
డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోరాదని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది జీవితాలు దుర్భరమయ్యాయి అని, వ్యసనాలకు బానిసలుగా కారాదన్నారు. విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విషయం తెలిసిన తక్షణమే సమాచారం ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల కట్టడి
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోనే తాడ్వాయి మండలం నేరాలు లేని, మత్తు మందు లేని ఆదర్శ మండలం గా ఎదగాలనిచ్చారు ఆకాంక్షించారు. 18 గ్రామ పంచాయతీ ప్రజలు సిసి కెమెరాలు మార్చుకుని నేర నియంత్రణ మండలంగా, గుడుంబా కూడా పెట్టరాదని, అమ్మ రాదని తెలిపారు. గంజాయి, గుట్కా, గుడుంబా, పేకాట, మత్తుమందు లేని ఆదర్శ మండలంగా ఎదగాలని ఆకాంక్షించారు.