– డాక్టర్ శివరంజని సంతోష్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైరల్ ఫీవరతో బాధ పడుతున్న పిల్లలను బడికి పంపొద్దని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ డాక్టర్ శివరంజని సంతోష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పిల్లల్లో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. చాలా మట్టుకు ఆస్పత్రిలో కూడా చేరుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో చికిత్స తీసుకుంటున్న పిల్లలను చాలా మంది తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తున్నారని తెలిపారు. దీంతో ఇతర పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని హెచ్చరించారు. వైరల్ ఫీవర్లు ఉన్న సమయంలో ఇంటి వద్దనే చికిత్స అందించడం ద్వారా ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందని సూచించారు.