గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ అమ్మితే తీసుకోవద్దు

– పోగొట్టుకున్న సెల్‌ ఫోన్‌ అందజేసిన ఎస్సై మహేష్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
గుర్తు తెలియని వ్యక్తులు సెల్‌ ఫోన్‌ అమ్మితే తీసుకోవద్దని హుస్నాబాద్‌ ఎస్‌ఐ తోట మహేష్‌ అన్నారు. ఇటీవల పోగొట్టుకున్న సెల్‌ ఫోన్‌ను సిఈఐఆర్‌ టెక్నాలజీతో స్వాధీనం చేసుకొని బాధితుదు దొంతర వేణి రాజ్‌ కుమార్‌కు పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఎస్‌ఐ అందజేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ ఎస్‌ఐ మహేష్‌ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వెబ్సైట్లో ఫోన్‌ ఐఎంఈఐ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే ఫోన్‌ దొరికిన వ్యక్తి సెల్‌లో సిమ్‌ కార్డు వేసుకోవడంతో అతని వివరాలతో కూడిన సమాచారం వస్తుందన్నారు. ఫోన్‌ తీసుకెళ్లిన వ్యక్తి నుంచి ఫోను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తామన్నారు. ఈ పోర్టల్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.