రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని కథానాయికల్లో ఒకరైన దక్షా నాగర్కర్ మీడియాతో ముచ్చటించారు. ‘ఈ సినిమా కోసం నన్ను నిర్మాత అప్రోచ్ అయ్యారు. నా పాత్ర, లుక్ గురించి చెప్పారు. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. దర్శకుడు సుధీర్ వర్మ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ సినిమాలో భాగం అవ్వడం హ్యాపీ. ఇందులో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పకూడదు. ఇప్పటికైతే సస్పెన్స్. నటన విషయానికి వస్తే.. పెర్ఫార్మెన్స్‌కి చాలా స్కోప్ ఉండే పాత్ర చేశాను. క్రైమ్ థ్రిల్లర్ చేయడం నాకు కొత్త. ‘హోరాహోరి’లో మెంటల్ డిస్టర్బ్‌గా ఉండే అమ్మాయిగా, ‘హుషారు’లో దిల్ చాV్‌ాతా హై తరహ పాత్ర, అలాగే ‘జాంబిరెడ్డి’లో చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో చేసిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్రని చూసి సర్‌ప్రైజ్ అవుతారు. సుధీర్ వర్మ చిత్రాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన ఈ కథని నెరేట్ చేస్తున్నప్పుడే ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా..! మీ పాత్రకు సరైన ప్రాధన్యత ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే నాకు మాత్రం అలా ఏం అనిపించలేదు. నాకు ఒక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకి ఎంత న్యాయం చేయగలనో అనే దానిపైనే ఫోకస్ చేశాను. నా పాత్రని బాగా ఇన్వాల్వ్ అయి చేశాను. నా పాత్రకు మంచి పేరొస్తుంది.