నవతెలంగాణ – భువనగిరి
గత ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో విలేకర్లు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడాతూ.. గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల భూములను గుంజుకుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గొర్లు, బర్లు, బతుకమ్మ చీరలు తప్ప ఏమి నిరూపేదల కోసం ఏమి చేయ్యలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రస్తుతం తెలంగాణను ఘాడిలో పెడతామన్నారు. కేటీఆర్ అధికారం పోయిన షాక్ లో ఉన్నాడు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతురన్నారు. కేటీఆర్ మేము వంద రోజుల్లో అమలు అన్నాం 40 రోజులు అయింది ఇందులో రెండు అమలు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బండ సోమారంలో 24 గంటల ఉచిత కరెంటు అమలు గురించి బాహాటంగా బయట పెట్టాము. అన్ని సబ్ స్టేషన్ లలో లాగ్ బుక్ పెడతాం.. గృహాలకు ఉచిత కరెంటు పథకం విషయంలో ఆలోచించి మాట్లాడు కేటీఆర్ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీ లను మేము అమలు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అంటున్నారు.. ఆరు నెలల్లో పడిపోతుంది. 39 మంది ఎమ్మేల్యే లను 39 ముక్కలు చేస్తాం. మీ పార్టీనీ 14 ముక్కలు చేస్తాను అంటూ బీఆర్ఎస్ పై కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ముఖ్యమంత్రి అన్నట్టుగా మీ బీఆర్‌ఎస్ పార్టీని మేము బరాబర్ బొంద పెడతాం హెచ్చరించారు. ప్రగతి భవన్ లోకి వెళ్ళడానికి హోం మినిస్టర్ మహుమ్మద్ అలీకి కూడా గతంలో అనుమతి లభించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు ఏమి లేవని ప్రతి రోజువందల సంఖ్యంలో మా ఇంటికి, మా కార్యాలయాలకు వస్తున్నారన్నారు.
త్రిబుల్ తెలంగాణకు మణిహారంః త్రీబుల్ ఆర్ తెలంగాణకు మణిహారం అని తెలిపారు. త్రీ బుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చటానికి ప్రయత్నం చేస్తా దీని మీద అధికారులు రివ్యూ చేశాము. ఔటర్ నుంచి 60 కిలోమీటర్ ల అవాల నుంచి రహదారి పోవాలి నిబంధనలు ఉన్నాయన్నారు. వీటిపై అధికారులు పరిశీలన చేసి. వారం తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నల్లగొండ నాకు రాజకీయకంగా జన్మనిచ్చిందని భువనగిరి నాకు పునర్జన్మ ఇచ్చిదన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు, నాయకులకు కృతజ్ఞత తెలిపారు.

ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యేగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని నీ గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
భువనగిరి లో100 కోట్ల తో స్టేడియం నిర్మాణం జాతీయస్థాయిలో హైదరాబాద్ తర్వాత ఇక్కడ క్రీడలు నిర్వహించే విధంగా ఏర్పాటుకు మంత్రి పొంగులేటి తన తొలి సంతకం చేశారన్నారు. భువనగిరి ఖిల్లా రోప్ వే పనులకు తొందరలోనే టెండర్లు పిలుస్తాం త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బస్వాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం అందజేయాలని అధికారాల తో పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. యాదాద్రి భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. ఆటో లు అనుమతి గురించి ఆలోచిస్తున్నామన్నారు. కొలనుపాక వద్ద వాగు పై వెంటనే నిర్మాణం 17 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నాము. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆలేరు. 45 కోట్లు ఆలేరు, 40 కోట్లు భువనగిరి నియోజకవర్గానికి రోడ్లు కోసం కేటాయించినట్లు తెలిపారు. వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి, పోచంపల్లి రుద్ర వెల్లి బ్రిడ్జి నిర్మాణం కు అనుమతి ఇచ్చామన్నారు. కెసిఆర్ యాదాద్రి క్షేత్రం విషయంలో సొంత ఎమ్మెల్యే అభిప్రాయం కూడా తీసుకోలేదని సమస్యలు ఉన్నాయని దేవాదాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి అభివృద్ధి పై సమీక్ష చేస్తాం చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విఫ్ బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు.
కార్యాకర్తల మధ్చ తోపులాట
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వచ్చిన నేపధ్యంలో మంత్రిని పలువురు కార్యాకర్తలు ఘనంగా స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మహ్మద్ నజీర్ మంత్రికి శాలువాతో సత్కరించడం దగ్గరకు వచ్చా రు. దీంతో అండగా ఉన్న మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు అడ్డముగా ఉండడంతో పక్కకు జరిగితే సన్మానం చేసి వెళ్తామని చెప్పడంతో అలాగే నిలబడ్డారు. ఎప్పుడు ఉంటారు మేము కలిసి వెళ్లిపోతామని అని చెప్పారు.దింతో పోతంశెట్టి వెంకటేశ్వర్లు మీరు ఏవరు అని సంబోదించడంతో గొడవ జరిగింది. అధికారుల సమీక్షలో నాయకులుః మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం కలెక్టరేట్ కార్యాలయంలో స్టేట్ ఛాంబర్‌లో సమావేశం నిర్వహిచారు. కాగా విలేకర్లుకు ఆహ్వానం అందగా అక్కడి వెళ్లారు. లోనికి వెల్లి క్రమంలో కేవలం అధికారు మాత్రమే ఉండాలని సెక్యూటీరి సిబ్బంది విలేకర్లు పంపించారు. సమీక్ష సమావేశంలో కొంత మంది ఎలాంటి పదవులు లేని నాయకులు అందులో కుర్చోవడంతో కొద్ది సెపు బాయ చర్చనీయశంగా మారింది. కనీసం విలేకర్లు కుర్చొవడంతో కోసం కూర్చిలు వేయ్యకపోవడంతో వెయ్యక పోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రికి స్వాగతంః
మంత్రిగా తొలగిసారి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెండగే పూల మొక్క ఇచ్చిన స్వగతం ఫలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, వీరారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.