దళారులను నమ్మి మోసపోవద్దు

నవతెలంగాణ కంటేశ్వర్: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని, దరఖాస్తు గడవు సోమవారంతో ముగిసిందని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం మంగళవారం తెలియజేశారు. ఆర్ బి ఎస్ కే లో మరియు జాతియ ఆరోగ్య మిషన్లో వివిధ పోస్టుల కోసం అనగా వైద్యాధికారులు, ఎంఎల్ హెచ్పి లు, స్టాప్ నర్సులు, డాటా ఎంట్రీ ఆపరేటర్, న్యూట్రిషన్ కౌన్సిలర్, ఎపిడమాలజిస్ట్, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు మరియు డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు గడువు సోమవారం సాయంత్రం ముగిసింది. కావున ఈ పోస్టులన్నీ పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే నియామకాలు చేపడతామని తెలియజేశారు. నియామకాల విషయంలో ఎలాంటి దళారులు, పైరవీకారులను అంగీకరించమని తెలియజేశారు. దరఖాస్తుదారులు పైరవీకారులను నమ్మి వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ఇంతకు ముందు జరిగిన అన్ని నియామకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు, దరఖాస్తుదారులకు పైరవీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే మా కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.