దళారులను నమ్మి మోసపోవద్దు

నవతెలంగాణ – రాయపర్తి
రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాయపర్తి పిఎసిఎస్ కార్యదర్శి సోమయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో, ఉకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ..రైతు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం వరి క్వింటాలుకు ఏగ్రేడ్‌ రూ.2,203, బిగ్రేడ్‌ రూ.2,183గా నిర్ణయించిందన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యాన్ని రైతులు బాగా ఆరబెట్టి తీసుకురావాలన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన వారం పది రోజుల్లోనే ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ అసిస్టెంట్, సెంటర్ ఇంచార్జ్ ఐత మల్లేష్, రాకేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.