నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయొద్దు అని మల్లాపురం ఎంపిటిసి కర్రే విజయ వీరయ్య అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మల్లాపురంకు సాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ రద్దు అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు అయింది అని, మల్లాపురంలో మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేసి, కట్టించి తీరుతామని అన్నారు.