
నవ తెలంగాణ – సిద్దిపేట
నిలువ ఉంచిన ఆహార పదార్ధము లు ప్రజలకు అమ్మవద్దని, అమ్మే ఆహార పదార్థాలు ప్లాస్టిక్ ప్లేట్ లలో కాకుండా స్టీల్ ప్లేట్స్ నీ వాడాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజ నర్సు ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ కు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశం మేరకు నాస్వి సంస్థ, నేస్ట్లే సంస్థ, ఫసాయి సంస్థ ఆధ్వర్యం లొ సిద్దిపేట పురపాలక సంఘం సహకారం త్తో పట్టణంలోని ఫుడ్ స్ట్రీట్ వెండర్ లకు ఎన్జీవో భవన్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
500 మంది ఫుడ్ స్ట్రీట్ వెండర్ లకు వారు అమ్మే ఆహార పదార్థాల పరిశుభ్రత గురించి శిక్షణ కార్యక్రమం నివ హించారు. పరిశుభ్రమైన నాణ్యత సర్టిఫికేట్ గల నూనె లను వాడాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఫుడ్ స్ట్రీట్ వెండర్ లు శుచి గ వండిన ఆహార పదార్ధము ల పై ఏటు వంటి క్రిమి, కీటకాలు వాల కుండ మూతలు పెట్టి జాగ్రత్త వహించాలన్నారు. అమ్మే బండి వద్ద పరిసరాలు శుభ్రము గా వుంచు కోవాలని, మెప్మ ద్వారా స్ట్రీట్ వెండర్ లకు నాశ్వి, నెస్లి సంస్థ ల ద్వారా శిక్షణ ఇవ్వడం సంతోషం అన్నారు. ఈ కార్యక్రమం లో మెప్మా డీసీఎం హనుమంత్ రెడ్డి, టీఎంసీ సాయి కృష్ణ, ఏడిఎంసి సంతోషి మాతా, సి ఓ లు రమ్య, జ్యోతీ, నెస్ట్లే ప్రతినిధి వసీం , కడంబిని, ఫుడ్ సేఫ్టీ అధికారి ఖలీల్, నాస్వీ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శలేవన్ , ఫాస్తాక్ ట్రైనీ స్నేహం , స్ట్రీట్ ఫుడ్ వెండర్ లు పాల్గొన్నారు.