బీజేపీ, బీఆర్ఎస్ లకి ఓటు వేసి వృదా చేసుకోవద్దు: మంత్రి పొన్నం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే గా 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుందని సమస్యలు అన్ని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పది ఏళ్ల పాలనలో ఒక్క  రేషన్ కార్డు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా..
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , కెడం లింగమూర్తి, చిత్తారి రవీందర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.