ప్రజలెవరు ఆందోళన చెందవద్దు..!

– చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవు
– నేటి నుంచి ఆంక్షలు ఎత్తివెత
– ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్.

నవతెలంగాణ- జన్నారం
కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేదిస్తూ విధించిన ఆంక్షలను శుక్రవారం ఎత్తి వేసిందని, ఇకపై చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ తెలిపారు. ప్రజలేవరు ఆందోళన చెంద వద్దని పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ దొబ్రియాల్ ను కలిసి అటవీ శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు. రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తు వినతి పత్రాన్ని అందజేశారు. నేటి నుంచి చెకపోస్టుల వద్ద నుంచి ఒక్క ఫిర్యాదు రాకూడదని ఎమ్మెల్యే పిసి సిఎఫ్ కు సూచించారు.చెక్ పోస్టుల వద్ద ఎలాంటి వేధింపులు ఉండవని స్థానికులు తమ ఆధారాలు చూపి రాకపోకలు సాగించవచ్చని వారిని అడ్డుకోకుండా అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పిసి సిఎఫ్  హామీ ఇచ్చారన్నారు.