ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.. ఆందోళ వద్దు 

Loan waiver is applicable to every farmer.. Don't worry– మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కొంతమందికి కొన్ని కారణాలవల్ల రుణమాఫీ కాని వారి కోసం రైతు వేదికలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని  ప్రత్యేక కౌంటర్లు రుణమాఫీ పొందని రైతు ఫిర్యాదు చేయవచ్చని మండల వ్యవసాయ అధికారి  ఆస్మిన్ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ జీవో నెంబర్ 567 ప్రకారం ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు లోన్ తీసుకున్నట్లయితే వారికి వర్తిస్తుందని ఎవరు కూడా అధైర్య పడవద్దు అని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు ఆధార్ కార్డు నెంబర్ సరిగా వేయక కొంతమందికి పట్టాదార్ పాస్ పస్తకం లేక కుటుంబ నిర్ధారణ లేకపోవడంతో కొంతమంది రైతులకు ముందలేకపోవచ్చు అని అన్నారు. వారికోసం రైతు వేదికలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు దీనిని రుణమాఫీ ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.