ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను అందిస్తామని ఎంపీడీవో వేణుమాధవ్, తహశీల్దార్ వీరగంటి మహేందర్, మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏఈఈ రమ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రతీ అధికారి తన పాత్రను జవాబుదారీతనం లో విధులు నిర్వర్తించాలన్నారు. సృజనాత్మక ఆలోచనలతో, టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించి వేగంగా, నాణ్యతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సేవలు దైవ కార్యమని, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అన్ని శాఖల సంబంధించిత అధికారులు పాల్గొన్నారు.