అనిల్ కుమార్ రెడ్డి గెలుపుకై ఇంటింటా ప్రచారం

నవ తెలంగాణ- వలిగొండ రూరల్: ఈ నెల 30 న జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని మండలంలోని రెడ్లరేపాక, నాతాళ్ళగూడెం, జంగారెడ్డి పల్లెలో స్థానిక నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి పార్టీ అధిష్టానం ప్రకటించిన 6 హామీలను ప్రజలకు వివరిస్తూ చేతి  గుర్తుకు ఓట్లు వేసి  అనిల్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే గా  భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. అనంతరం గొల్నేపల్లికి చెందిన వెల్డండ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో యువత కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తి రెడ్డి, ఉలిపే  మల్లేశం, పలుసం బాల రాజు, పరందాములు, పిసాటి అంజిరెడ్డి, బండారు నారసింహ రెడ్డి, గంగాపురం వెంకటేష్, బసిరెడ్డి నవీన్ రెడ్డి, కుంభం సాయి కిరణ్ రెడ్డి, ముదిరెడ్డి శివారెడ్డి, బసిరెడ్డి ఉదయ్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.