నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డి గెలుపుకై సీపీఐ(ఎం) నాయకులు ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పేదల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని అన్నారు. కార్మికుల, కర్షకుల సమస్యలే తన ప్రధాన ఎజెండాగా తీసుకెళ్తూ ముందుకు సాగుతుందని అన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలు తోపాటు మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రశ్నించే గొంతుకగా దోనూరు నర్సిరెడ్డి సుత్తి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాట యాదయ్య , వేముల లింగస్వామి, యాస రాణి వీరయ్య, సాగర్ల మల్లేష్ పార్టీ సభ్యులు యువకులు తదితరులు ఉన్నారు.